అంతర్జాతీయ పరిణామాలు మరియు రూపాయి బలపడటం కారణంగా భారత స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో తుది ఒప్పందం దిశగా ముందుకెళ్తున్నామని, హోర్ముజ్‌లో “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించడం మార్కెట్లకు సానుకూల సంకేతాలిచ్చింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.08 వద్ద స్థిరపడటం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో BSE Sensex, Nifty 50 లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
గత సెషన్ ముగింపు 77,017తో పోలిస్తే, సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల లాభంతో 77,424 వద్ద ప్రారంభమైంది. ఉదయం 10 గంటల సమయానికి 313 పాయింట్ల లాభంతో 77,331 వద్ద కొనసాగింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 117 పాయింట్ల పెరుగుదలతో 24,150 వద్ద ట్రేడ్ అవుతోంది.
షేర్ మార్కెట్లో కోఫోర్జ్, ఫోర్స్ మోటార్స్, ఎస్ఆర్ఎఫ్, యెస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ వంటి షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు లార్సన్, హిటాచీ ఎనర్జీ, యునైటెడ్ స్పిరిట్స్, బ్లూ స్టార్, సీజీ పవర్ వంటి షేర్లు నష్టాల్లో కదిలాయి.
మిడ్‌క్యాప్ మరియు బ్యాంకింగ్ షేర్లు కూడా మంచి ప్రదర్శన చూపుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 607 పాయింట్ల లాభంతో ఉండగా, బ్యాంక్ నిఫ్టీ 638 పాయింట్ల పెరుగుదలతో ట్రేడ్ అవుతోంది.
