గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారని, ఇప్పుడు వారికి తిరిగి హక్కులు కల్పిస్తున్నామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు.
కొత్తవలస మండలం చీడివలస గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమమే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాలక్ష్మి, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, కొత్తవలస పీఏసీఎస్ అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బొబ్బిలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ నాయకులు కనకాల శివ, బంగారు రమేష్, గొంప దుర్గా ఉమేష్, మాజీ సర్పంచ్ సీహెచ్ అప్పలనాయుడు కూడా హాజరయ్యారు.
రైతులకు భూ హక్కులు అందించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
