హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ విద్యార్థులకు పరీక్షల విభాగం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల విడుదలైన ఎంటెక్ ఫలితాల్లో అనేక మంది విద్యార్థులకు అనూహ్యంగా తక్కువ మార్కులు రావడంతో పాటు, కొందరికి ఇంటర్నల్ పరీక్షల్లో సున్నా మార్కులు నమోదు కావడం వివాదాస్పదంగా మారింది.
ప్రైవేట్ కళాశాలలు మాత్రమే కాకుండా యూనివర్సిటీ అనుబంధ కాలేజీల విద్యార్థులు కూడా ఈ పరిస్థితితో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో చదువుతున్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో మంచి గ్రేడ్లు వచ్చినప్పటికీ, ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో సున్నా మార్కులు రావడం అనుమానాలకు తావిస్తోంది.
విద్యార్థి సంఘాల ప్రకారం, ఎంసెట్, పీజీఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం విచారకరం. సమస్యపై ప్రశ్నిస్తే రీవాల్యుయేషన్ కోసం రూ.3000 చెల్లించాలని సూచిస్తున్నారని, కానీ అసలు సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
బాధితులు తమ విభాగాధిపతులను సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాకపోవడం, పరీక్షల విభాగం కూడా బాధ్యత తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి, తక్షణమే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వైస్ చాన్స్‌లర్‌ను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు కృషిని ప్రశంసించిన ప్రధాని మోదీ, జన్మదిన శుభాకాంక్షలు…
