ఆపరేషన్ సిందూర్ ప్రారంభమై ఏడాది పూర్తైన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) విడుదల చేసిన వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “భారత్ ఏదీ మర్చిపోదు.. దేనినీ క్షమించదు” అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో భారత వైమానిక దళం సామర్థ్యం, ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి, వైమానిక దాడుల దృశ్యాలను ప్రదర్శించారు. పేలుళ్లు, క్షిపణి దాడులు, సైనిక సమీకరణలు, యుద్ధ సన్నాహక దృశ్యాలు వీడియోలో హైలైట్గా నిలిచాయి.
“ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతుగా నిలిచిన వారిని భారత్ వెంబడించి శిక్షిస్తుంది” అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హెచ్చరికను కూడా వీడియోలో ప్రస్తావించారు. దీంతో ఈ వీడియోకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
2025 మే 7న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్” ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం భారీ దాడులు నిర్వహించింది.
బ్రహ్మోస్ క్షిపణుల వినియోగం, లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు, సైనిక వ్యూహాలు వీడియోలో స్పష్టంగా చూపించారు. దేశ భద్రతకు ముప్పుగా మారే శక్తులపై భారత్ ఇకపై మరింత దృఢంగా వ్యవహరిస్తుందనే సంకేతాన్ని ఐఏఎఫ్ ఈ వీడియో ద్వారా మరోసారి స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో షేర్ అవుతోంది. దేశభక్తి భావాలను రేకెత్తించేలా రూపొందించిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
AI Agents Are Transforming Finance: Anthropic’s Big Move Explained
