మహారాష్ట్రలో హృదయ విదారక ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ జిల్లాలో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కుటుంబం ఒక కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లి నేరుగా నీటితో నిండిన బావిలో పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. చిన్నపిల్లలు కూడా మృతుల్లో ఉండటం అందరినీ కలచివేసింది.