ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు.
సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మెమో జారీ చేసింది. ప్రతి శుక్రవారం కలెక్టర్లు, అధికారులు ఫీల్డ్ విజిట్లు నిర్వహించాలని స్పష్టంగా పేర్కొంది.
మెమో ప్రకారం కార్యదర్శులు నెలకు కనీసం మూడు రోజులు, శాఖాధిపతులు ఆరు రోజులు, జిల్లా కలెక్టర్లు ఎనిమిది రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుంది. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.
అధికారుల ఫీల్డ్ విజిట్లను ప్రత్యేక ఆన్లైన్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికారులు తమ పర్యటన తేదీలు, సందర్శించిన గ్రామాలు లేదా పట్టణాలు, గుర్తించిన సమస్యలు, తీసుకున్న చర్యలు వంటి వివరాలను ఆర్టీజీఎస్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. దీంతో ప్రభుత్వ పనితీరు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
AI Agents Are Transforming Finance: Anthropic’s Big Move Explained
