Donald Trump ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు అమెరికన్ వార్‌షిప్‌లపై ఇరాన్ దాడులు జరిపిందని ఆయన వెల్లడించారు. అమెరికా ప్రతిదాడుల్లో ఇరాన్ నౌకలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు.
ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో వెల్లడించారు. అమెరికా డిస్ట్రాయర్లపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి జరిగిందని పేర్కొన్నారు. అయితే అమెరికా యుద్ధనౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
Strait of Hormuz గుండా వెళ్తున్న మూడు అమెరికన్ యుద్ధనౌకలపై ఇరాన్ దాడి చేసిందని ట్రంప్ తెలిపారు. అమెరికా రక్షణ వ్యవస్థ మిస్సైళ్లను గాల్లోనే కూల్చివేసిందని, డ్రోన్లను కూడా ధ్వంసం చేసిందని చెప్పారు.
దాడికి పాల్పడిన ఇరాన్ నౌకలు తీవ్ర నష్టం చవిచూశాయని ట్రంప్ పేర్కొన్నారు. చిన్న పడవలతో సహా పలు నౌకలు సముద్రంలో మునిగిపోయాయని వెల్లడించారు. అమెరికా నౌకలు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటాయని తెలిపారు.
ఇరాన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్.. “ఇరాన్ సాధారణ దేశం కాదు. ఆ దేశాన్ని పిచ్చివాళ్లు నడిపిస్తున్నారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాల వినియోగానికి అవకాశం దొరికితే ఇరాన్ వెనుకాడదని ఆరోపించారు.
ఇరాన్ త్వరగా ఒప్పందంపై సంతకం చేయకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
కార్మికుల కోసం సీఎం చంద్రబాబు భారీ వరాలు.. మేడే సందర్భంగా కీలక ప్రకటనలు….
