ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ప్రస్తుతం మంత్రి నారా లోకేశ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. “Guess who’s coming to AP?” అంటూ ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ట్రెండీ కళ్లజోడు ధరించి, స్టైలిష్ లుక్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కనిపించారు. దీంతో నెటిజన్లు వెంటనే ఆ వీడియో వెనుక ఉన్న సంకేతాన్ని గుర్తించారు. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్‌కు రాబోతోందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ పొందింది.
తిరుపతిలో రూ.2,500 కోట్ల పెట్టుబడితో మోటార్ సైకిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే లోకేశ్ చేసిన వీడియో పోస్టు ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ రాకపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
AI Agents Are Transforming Finance: Anthropic’s Big Move Explained
