ఇటీవల రూ.1.5 లక్షల మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో పసిడికి డిమాండ్ పెరుగుతోంది.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం గురువారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,140గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,39,460గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,290గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,610గా నమోదైంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరగడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక వెండి ధరలు కూడా పెరుగుదల దిశగా సాగుతున్నాయి. కిలో వెండి ధరపై రూ.100 వరకు పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,75,100గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,65,100గా నమోదైంది. చెన్నైలో రూ.2,75,100గా ఉండగా.. బెంగళూరులో రూ.2,65,100గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
AI Agents Are Transforming Finance: Anthropic’s Big Move Explained
