ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం కీలక చర్యలు తీసుకుంటోంది. ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర’ పథకం కింద బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ సైకిళ్లను సబ్సిడీపై అందించేందుకు సిద్ధమైంది.
ఈ సైకిళ్లపై ప్రభుత్వం సుమారు రూ.11,000 వరకు రాయితీ ఇస్తోంది. దీంతో ప్రజలు ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను కేవలం రూ.24,000కే కొనుగోలు చేయవచ్చు.
ఈ సైకిళ్ల వాడకం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా పెట్రోల్ ఖర్చులు కూడా ఆదా అవుతాయి. చార్జింగ్ ద్వారా సులభంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ పథకం ద్వారా పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహిస్తూ, ప్రజలకు ఆర్థికంగా కూడా ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
