హైదరాబాద్‌లో దివంగత మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన భవనాన్ని Greater Hyderabad Municipal Corporation (GHMC) అధికారులు సీజ్ చేశారు.
నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ భవనానికి 2017 నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదని అధికారులు తెలిపారు. దీంతో బకాయిల వసూళ్లలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
యూసఫ్‌గూడా సర్కిల్ పరిధిలోకి వచ్చే ఈ జీ+4 భవనంపై పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిల కారణంగా సీజ్ చేసి నోటీసులు అంటించారు.
పన్నులు చెల్లించని ఇతర ఆస్తులపై కూడా ఇదే విధంగా చర్యలు కొనసాగుతాయని GHMC అధికారులు హెచ్చరించారు.
