చంద్రబాబు క్యాడర్‌పై ఆగ్రహం.. పవన్‌తో మంచి సంబంధాలున్నాయని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు N. Chandrababu Naidu తన పార్టీ నేతలు, కార్యకర్తల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తనను బాధించాయని చెబుతూ, క్రమశిక్షణ తప్పితే ఎలాంటి సహనం ఉండదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
టీడీపీ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు, “అధికారం వచ్చిందన్న అహంకారంతో ఎవ్వరూ ప్రవర్తించకూడదు” అని స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదగా, సౌమ్యంగా ఉండాలని, అందుబాటులో ఉండాలని సూచించారు. నేతలు, కార్యకర్తలు చేసే చిన్న తప్పులే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల దగ్గర చిన్నపాటి గొడవలు కూడా అనవసరమని, అలాంటి ప్రవర్తన ప్రజల్లో వ్యతిరేక భావన పెంచుతుందని హెచ్చరించారు. గతంలో అధికారంలో ఉన్నవారి అహంకారాన్ని ప్రజలు ఎలా తిప్పికొట్టారో గుర్తు చేస్తూ, అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదన్నారు. బూతులు, దాడులు, సెటిల్మెంట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని క్యాడర్‌కు స్పష్టం చేశారు.
ఇక కూటమి రాజకీయాలపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. Pawan Kalyan తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇద్దరూ సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇదే స్పూర్తి క్షేత్రస్థాయిలో కూడా కనిపించాలని సూచించారు. జనసేనతో పాటు బీజేపీతో కూడా సమన్వయం కొనసాగించాలని చెప్పారు.
రాష్ట్రం మరియు కేంద్రం మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా ముందుకు సాగాలని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. అలాగే, టీడీపీ ఎమ్మెల్యేలు “తాను లేకుండా ఎంపీ రావద్దు” అనే విధంగా ప్రవర్తించడం సరైంది కాదని, అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
చంద్రబాబు పార్టీ క్యాడర్‌కు కఠిన హెచ్చరికలు ఇస్తూనే, కూటమి పార్టీలతో సమన్వయం, క్రమశిక్షణ, ప్రజలకు సేవ అనే అంశాలపై స్పష్టమైన సందేశం ఇచ్చారు.
నిప్పుల వర్షం కురిపిస్తున్న తెలంగాణ.. నిర్మల్‌లో 46°C, 8 జిల్లాల్లో ఎండల తీవ్రత…
About the Author
Anusha
Administrator
Anusha is a senior journalist and content writer at APNewsDaily.com with expertise in Andhra Pradesh politics, entertainment, and regional news. She has been covering Telugu news for over 5 years, bringing accurate and timely news to Telugu-speaking audiences across the world.
