విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు అక్టోబర్ 6 కీలక రోజుగా మారనుంది. భారత నౌకాదళం కోసం దేశీయంగా నిర్మిస్తున్న ఐదు Fleet Support Shipsలో తొలి నౌక FSS-1ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
FSS-1 ప్రత్యేకత ఏమిటి?
43,500 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ Fleet Support Ships సముద్రంలో ఉన్న యుద్ధ నౌకలకు ఇంధనం, నీరు, ఇతర అవసరమైన సరఫరాలను అందించడానికి రూపొందిస్తున్నారు. దీని వల్ల భారత నౌకాదళ నౌకలు తీరానికి తిరిగి రాకుండానే ఎక్కువకాలం సముద్రంలో కార్యకలాపాలు కొనసాగించే సామర్థ్యం పెరుగుతుంది.
18 నెలల్లో కీలక దశ
స్టీల్ కటింగ్ ప్రారంభమైన 18 నెలల్లోనే FSS-1ను బంగాళాఖాతంలోకి ప్రవేశపెట్టే దశకు తీసుకువచ్చినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. ఇదే కార్యక్రమంలో FSS-5కు keel laying కూడా జరగనుంది.
షిప్‌యార్డ్ సామర్థ్యం పెంపు
అప్‌గ్రేడ్ చేసిన Slipway-4, 300 టన్నుల Goliath Craneను కూడా ప్రారంభించనున్నారు. ఈ సదుపాయాలతో 45,000 DWT వరకు భారీ నౌకలను నిర్మించి launch చేసే సామర్థ్యం హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు లభిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తదితరులు పాల్గొననున్నట్లు అధికారిక సమాచారం.
సోర్స్: Press Information Bureau / Ministry of Defence, 5 October 2026.
