తెలుగు బుల్లితెరపై కామెడీకి కొత్త ట్రెండ్ సెట్ చేసిన షోల్లో Jabardasth ఒకటి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్న ఈ షో ఇప్పుడు మరోసారి పాత వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అందులో భాగంగానే ప్రేక్షకులకు ఒక భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఒకప్పుడు తన పంచ్‌లతో షోనే షేక్ చేసిన స్టార్ కమెడియన్ Hyper Aadi మళ్లీ జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
హైపర్ ఆది పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది అతని ఫాస్ట్ పంచ్‌లు, టైమింగ్ కామెడీ. జబర్దస్త్‌లో అతను చేసిన స్కిట్లు అప్పట్లో యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించేవి. అతని టీమ్ వచ్చిన ఎపిసోడ్ అంటే ప్రేక్షకులు టీవీల ముందే కూర్చునేవారు. అలాంటి ఆది సినిమాల్లో అవకాశాలు రావడంతో క్రమంగా షోకు దూరమయ్యాడు. తర్వాత వెండితెరపై బిజీ కమెడియన్‌గా మారిపోయాడు.
అయితే హైపర్ ఆది వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్‌లో ఆ ఎనర్జీ కొంత తగ్గిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కనిపించింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి పాపులర్ ఫేస్‌లు దూరం కావడంతో షో రేటింగ్స్ కూడా ప్రభావితమయ్యాయి. మధ్యలో కొత్త టీమ్‌లు వచ్చినా, పాత మజా మాత్రం మిస్సయ్యిందని అభిమానులు కామెంట్లు చేసేవారు.
ఇప్పుడేమో పరిస్థితి మారుతోంది. ఇటీవల మళ్లీ జబర్దస్త్ జడ్జీగా Naga Babu తిరిగి రావడం షోకు కొత్త ఊపు తీసుకొచ్చింది. అదే సమయంలో విడుదలైన తాజా ప్రోమోలో హైపర్ ఆది కనిపించడం ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేసింది. తనదైన స్టైల్లో టీమ్ లీడర్లపై, కంటెస్టెంట్లపై పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయించాడు.
ప్రోమో చివర్లో నాగబాబు “ఆది.. మళ్లీ ఎప్పుడొస్తావ్ జబర్దస్త్‌కు?” అని అడగగా, “జూన్ నుంచి స్టార్ట్ చేస్తా” అంటూ హైపర్ ఆది సమాధానం ఇచ్చాడు. దీంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. అంతేకాకుండా “అందరినీ కలుపుకుని వస్తా” అని చెప్పడం మరింత ఆసక్తిని పెంచింది.
2013లో ప్రారంభమైన జబర్దస్త్ అప్పట్లో తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించింది. కామెడీ స్కిట్లతో గంటసేపు నవ్వించడం అనే కాన్సెప్ట్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. నాగబాబు, రోజా జడ్జీలుగా, అనసూయ యాంకర్‌గా షోను మరో స్థాయికి తీసుకెళ్లారు. వేణు, ధన్‌రాజ్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, చలాకీ చంటి వంటి టీమ్ లీడర్లు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రారంభమవడంతో ఎంటర్టైన్మెంట్ మరింత పెరిగింది. ఆ సమయంలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్‌లు అత్యంత ప్రజాదరణ పొందాయి. కానీ వాళ్లు షోను వీడిన తర్వాత జబర్దస్త్ కొంత డల్ అయ్యింది.
ఇప్పుడు మళ్లీ హైపర్ ఆది రీ ఎంట్రీతో షోకు పూర్వ వైభవం వస్తుందనే ఆశలు అభిమానుల్లో కనిపిస్తున్నాయి. మరోసారి తన పంచ్‌లతో బుల్లితెరపై నవ్వుల వర్షం కురిపించేందుకు హైపర్ ఆది రెడీ అవుతున్నాడు.
Bengal Government Ends Religious Honorarium Schemes, Orders Fresh Probe Into Women’s Safety Cases
