ప్రముఖ నటి Roja Selvamani కూతురు అన్షు మాలిక మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తన ప్రతిభతో ఇప్పటికే మంచి పేరు సంపాదించిన ఆమె, తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది.
గతంలో ‘బ్లూమ్ మ్యాగజైన్’ కవర్ పేజీపై ‘యంగ్ సూపర్ స్టార్స్’గా ఎంపికైన అన్షు ఫోటోను, ఆ మ్యాగజైన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ ఘనత తనకు ఎంతో గర్వంగా అనిపిస్తోందని అన్షు సోషల్ మీడియాలో వెల్లడించింది.
తండ్రితో కలిసి ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ఆమె, ఈ క్షణాలు తనకు మరింత ప్రత్యేకమని తెలిపింది. చిన్న విజయంగా భావించిన విషయం, ఇప్పుడు పెద్ద గుర్తింపుగా మారడం ఆనందంగా ఉందని పేర్కొంది.
