ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఐటీ, విద్య శాఖల మంత్రి Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.
మంత్రులు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ముఖ్యంగా గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని స్పష్టం చేశారు.
“పార్టీ కార్యకర్తల అభ్యర్థనలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలి. పార్టీ బలోపేతమే ముఖ్య లక్ష్యం” అని లోకేశ్ అన్నారు.
