అమెరికా టెక్ దిగ్గజం Oracle భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఏఐ ఆధారిత మార్పుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
ఈ ప్రభావం భారత్లో కూడా తీవ్రంగా పడింది. ఇక్కడే దాదాపు 12 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. చాలా మందికి ముందస్తు సమాచారం లేకుండానే ఉదయం ఇమెయిల్ ద్వారా టెర్మినేషన్ లెటర్స్ పంపినట్లు వార్తలు చెబుతున్నాయి.
AI వినియోగం పెంచడం, ఖర్చులను తగ్గించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
ఇప్పటికే Amazon, Meta, Microsoft వంటి కంపెనీలు కూడా ఇలాంటి లేఆఫ్స్ చేపట్టాయి.
ఈ పరిణామాలు ఉద్యోగ భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి.
