దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ కొరతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు Oil and Natural Gas Corporation కీలక చర్యలు చేపట్టాయి. అరేబియా సముద్రంలో ఉన్న దామన్ అప్‌సైడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించారు.
సుమారు ఒక బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును కేవలం రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ముంబైకి వాయువ్యంగా 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి గ్యాస్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ ముడి గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా గుజరాత్‌లోని హజీరా ప్రాసెసింగ్ ప్లాంట్‌కు తరలించి, అక్కడ శుద్ధి చేసి ఎల్పీజీగా మారుస్తారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తిని మరింత పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
