ఏపీ మంత్రి Nara Lokesh ఢిల్లీలో ప్రధాని Narendra Modiను కలిశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించిన సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్లో జరిగిన ఈ భేటీలో, బిల్లు ఆమోదానికి కృషి చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రధాని మోదీకి శాలువాతో సత్కారం చేశారు.
అమరావతి అభివృద్ధికి ఈ బిల్లు కీలకమని పేర్కొన్న లోకేష్, ప్రధాని మోదీని కలవడం ఆనందంగా ఉందని అన్నారు. మరోవైపు, ప్రధాని కూడా లోకేష్‌ను అభినందిస్తూ కంగ్రాట్స్ తెలిపారు.
లోకేష్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా లోక్‌సభ స్పీకర్, పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసినట్లు సమాచారం.
