Y. S. Jagan Mohan Reddy అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ **“ప్లాన్ బీ”**గా కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. తాము అమరావతికి లేదా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు సుమారు 110 కిలోమీటర్ల పరిధిని “కేపిటల్ కారిడార్”గా ప్రకటించాలని సూచించారు. ఈ ప్రాంతానికి “MA-VI-GUN (మావిగన్)” అనే పేరు పెట్టాలని ప్రతిపాదించారు.
ఈ కారిడార్ భవిష్యత్తులో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారే సామర్థ్యం ఉందని, సుమారు 40 లక్షల జనాభాతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని జగన్ తెలిపారు.
అమరావతి విషయంలో ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన, రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, రాజధాని పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని నిర్ణయం రాష్ట్రాలదేనని కూడా ఆయన పేర్కొన్నారు.
