ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్సభ సీట్లు 25 నుంచి 38కి పెరగనున్నాయనే అంచనాలు రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.
అంచనాల ప్రకారం రాయలసీమలోనే ఎక్కువ సీట్లు పెరగనున్నాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 21 వరకు, కడప-నెల్లూరు 15 వరకు, ప్రకాశం 18 వరకు చేరే అవకాశం ఉంది. దీంతో ఈ రీజియన్ మొత్తం సీట్లు 74 నుంచి 111కి పెరగవచ్చు.
2019లో వైసీపీ హవా, 2024లో కూటమి దుమ్ము… ఇప్పుడు సీట్లు పెరిగితే తర్వాత ఎవరి గేమ్ స్ట్రాంగ్ అవుతుందో చూడాలి అనే చర్చ రాజకీయాల్లో మొదలైంది.