ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీసాయి. మధ్యాహ్న భోజనంపై చేసిన వ్యాఖ్యలపై ఆయన మాజీ భార్య కామేశ్వరి స్పందిస్తూ కొన్ని సూచనలు చేశారు. ఒక శ్రేయాభిలాషిగా చెబుతున్నానని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇంట్లో కూర్చుని వీడియోలు చేసుకోవడం మంచిదని, నాలుగు నెలలు గడిస్తే అందరూ మర్చిపోతారనుకోవడం సరైంది కాదని అన్నారు. చేసిన వ్యాఖ్యల వల్ల ప్రజల్లో చర్చ పెరిగిందని, ఇకపై ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఇప్పటికైనా చేసిన తప్పులపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే దేవుడు క్షమిస్తాడని కామేశ్వరి అన్నారు. ఇకపై గరికపాటిపై తాను ఎలాంటి వీడియోలు చేయనని కూడా స్పష్టం చేశారు.