Ram Charan: రామ్‌చరణ్-ఉపాసనలకు ట్విన్స్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్.. ఏం పంపించారో తెలుసా? వీడియో
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఆనందోత్సాహాలతో కళకళలాడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులు మరోసారి తల్లిదండ్రులుగా మారడంతో కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ డబుల్ సంతోషం నెలకొంది.
ఇటీవల ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఉపాసనకు ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ పుట్టడంతో ఈ సంతోషం మరింత రెట్టింపైంది. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కుమార్తె ఉండగా, ఇప్పుడు ట్విన్స్ రాకతో వారి కుటుంబం మరింత సంపూర్ణమైంది.
ఈ శుభ సందర్భాన్ని అభిమానులతో కూడా పంచుకోవాలని భావించిన రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఓ అందమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమను ఎంతో అభిమానించే ఫ్యాన్స్‌కు స్వీట్ బాక్సులను పంపించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని స్వీట్ బాక్స్‌ను ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఆ గిఫ్ట్ బాక్స్‌లో రెండు రకాల స్వీట్స్ ఉండగా, “రామ్ చరణ్ – ఉపాసన నుంచి ఈ బహుమతి వచ్చింది” అంటూ ఆ అభిమాని క్యాప్షన్ రాశారు. అంతేకాదు, ఈ స్వీట్ బాక్స్ Apollo Hospitals నుంచి అందినట్టుగా పేర్కొన్నారు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఉపాసన ట్విన్స్‌కు జన్మనిచ్చిన వెంటనే అభిమానులు పెద్ద సంఖ్యలో అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుని సంబరాలు చేసిన విషయం తెలిసిందే. అభిమానుల ప్రేమను గౌరవిస్తూ, వారికి కృతజ్ఞతగా ఈ స్వీట్ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం.
మొత్తానికి, మెగా ఫ్యామిలీలో ఈ ఆనందం ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ – ఉపాసన దంపతుల కుటుంబానికి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తూనే ఉంది.
