విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకస్మికంగా వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడానికి అసలైన కారణం ఏమిటి? వీరద్దరి రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడబోయే తదుపరి వన్డే సిరీస్ తేదీలు ఎప్పుడు నిర్ణయించబడ్డాయో?
భారత్ మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి సిరీస్‌ను ముగించింది. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకున్నప్పటికీ, చివరి మ్యాచ్‌లో టీమిండియా చూపిన పోరాటం అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల అజేయ భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించింది. రోహిత్ శర్మ 125 బంతుల్లో శతకం సాధించి నాటౌట్‌గా నిలవగా, విరాట్ కోహ్లీ 74 పరుగులతో మెరిశారు.
కానీ ఈ విజయానికంటే పెద్ద చర్చకు కారణమైన విషయం – మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్రేక్షకులకు చేతులు ఊపుతూ వీడ్కోలు పలకడం. దీంతో “రోహిత్-విరాట్లు ఇక ఆస్ట్రేలియాలో మళ్లీ ఆడరా?” అన్న సందేహాలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లనుంచి రిటైర్ అయిన ఈ ఇద్దరు ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ 2027 తర్వాత పూర్తి స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తదుపరి వన్డే సిరీస్ 2027 వరల్డ్ కప్ తర్వాత మాత్రమే జరగనుంది. అంటే, సిడ్నీ వన్డే ఈ ఇద్దరి ఆస్ట్రేలియా పర్యటనకు చివరి మ్యాచ్ కావచ్చని భావిస్తున్నారు.
రోహిత్ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ, “మేము ఇక్కడ మళ్లీ ఆడగలమా లేదా తెలియదు. కానీ ప్రతి క్షణం నా గుండెల్లో నిలిచిపోతుంది” అని అన్నాడు. విరాట్ కూడా ఆస్ట్రేలియా అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగంగా స్పందించాడు.
